అమరావతి: రాత్రి నడిరోడ్డుపై ఎంఎల్ సి దువ్వాడ శ్రీనివాస్ హల్‌చల్ చేశారు. తనను చంపేందుకు వైసిపి నేత ధర్మాన కృష్ణదాస్ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. తనపై జరుగుతున్న కుట్ర గురించి అప్పన్న అనే వ్యక్తి మాధురికి ఫోన్ చేసి చెప్పాడన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో ప్రత్యర్థులకు దువ్వాడ సవాల్ విసిరారు. తాను చావుకు భయపడే వ్యక్తిని కాదు అని, తనపై ఎవరు దాడి చేస్తారో దమ్ముంటే రావాలన్నారు. హత్య కుట్రపై ఎస్ పి ఫిర్యాదు చేస్తానని దువ్వాడ స్పష్టం చేశారు.
దువ్వాడ ఆరోపణలపై వైసిపి నేత ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. తాను దువ్వాడ జోలికి వెళ్లడడం లేదని, తన గురించి దువ్వాడ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తనపై మాట్లాడితే మావాళ్లు రియాక్ట్ అవుతున్నారని, అప్పన్నతో అన్న మాట వాస్తవమేనని తెలిపారు.