బలగం తర్వాత అదే స్థాయిలో హృదయాన్ని తాకిన సినిమా దండోరా అని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ నేల నుంచి పుట్టిన ఈ చిత్రం సామాజిక అంశాలను మనసును తాకేలా ఆవిష్కరిస్తూ, తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను కలుపుతుందని ఆయన అన్నారు. గ్రామీణ జీవనశైలి, మనుషుల మధ్య ఉన్న సూక్ష్మ సంబంధాలను సహజంగా చూపిస్తూ నిజ జీవితానికి అద్దం పడుతుందని, మన చుట్టూ నిత్యం కనిపిస్తూనే పట్టించుకోని ఒక సామాజిక సమస్యను సున్నితంగా ప్రశ్నిస్తూ ఆలోచనకు దారితీసే సినిమా దండోరా అని, వినోదంతో పాటు విలువైన సందేశం అందించిన దండోరా టీమ్‌కు మంత్రి కోమటిరెడ్డి ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు.