హైదరాబాద్: దుబాయ్‌లో జరిగే అంతర్జాతీయ ఇన్నోవేషన్ సమ్మిట్‌కు మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు ఆహ్వానం లభించింది. జనవరి 9 నుంచి 11 వరకు దుబాయ్2లో ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ జరుగనుంది. పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ రంగాల్లో కెటిఆర్ చేసిన కృషిని గుర్తిస్తూ ఈ ఆహ్వానం ఆయనకు అందించారు.