పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌పై అబెట్‌మెంట్ యాక్ట్ పెట్టడంతో జైలు శిక్ష తప్పదని పోలీసులు తెలిపారు. తొక్కిసలాట జరిగేందుకు ప్రధాన కారణం కావడంతో థియేటర్ యాజమాన్యం,అల్లు అర్జున్‌పై అబెట్‌మెంట్ యాక్ట్ కింద కేసు నమోదుచేశారు. దీంతో యాజమాన్యానికి, అల్లు అర్జున్‌కు ఏడాది వరకు జైలు శిక్షపడుతుందని పోలీసులు భావిస్తున్నారు.సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటనలో చిక్కడపల్లి పోలీసులు కోర్టు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా 2024, డిసెంబర్‌లో ఆర్‌టిసి క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టులో 100 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అందులో ఏ 1గా థియేటర్ యాజమాన్యం, ఏ11గా పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్‌ను చేర్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు నిర్ధారించారు. వారిపై బిఎన్‌ఎస్ సెక్షన్45 ప్రకారం అబెట్‌మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు మేనేజర్లు , 8 మంది బౌన్సర్లను సైతం ఛార్జ్ షీట్‌లో చేర్చారు.