పాట్నా: ఇద్దరు యువతులు ప్రేమ పెళ్లి చేసుకున్న సంఘటన బిహార్ రాష్ట్రం మధేపురా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పూజా గుప్తా(21), కాజల్ కుమార్(18) అనే యువతులు సోషల్ మీడియాలో పరిచయమయ్యారు. వారి పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. త్రివేణి గంజ్ లోని కాళీ మాత మందిరంలో ఇద్దరు కలిసి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. హోమానికి బదులుగా గ్యాస్ స్టవ్ చుట్టూ ఏడు అడుగులు వేశారు. తాము పురుషులను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తేల్చి చెప్పారు. తమ బంధం పూర్తి మానసిక బంధంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కలికాలం కాకపోతే ఇద్దరు అమ్మాయి పెళ్లి చేసుకోవడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు బాగానే పెళ్లి చేసుకున్నారు కానీ సమాజం ఒప్పుకుంటుందా? అని నిలదీస్తున్నారు.