న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను ప్రశంసిస్తూ ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోస్ట్ పెట్టారు. ప్రధాని మోడీకి చెందిన ఓ పాట ఫొటోని ఆయన షేర్ చేశారు. గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన పాత ఫోటోను దిగ్విజయ్ సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో బిజెపి అగ్రనేత ఎల్‌కె అడ్వాణీ కుర్చిలో కూర్చొని ఉండగా.. ప్రస్తుత ప్రధాని మోడీ నేలపై అడ్వాణీ కాళ్ల దగ్గర కూర్చున్నారు. నేలపై కూర్చొన్న వ్యక్తి దేశానికి ప్రధానిగా అయ్యారంటూ మోడీని ఉద్ధేశిస్తూ దిగ్వియర్ పోస్ట్ పెట్టారు.
‘‘నేను ఓ ఫోటో చూశాను. చాలా ఆసక్తికరంగా ఉంది. ఆర్ఎస్ఎస్‌లో సామాన్య కార్యకర్తలా.. నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చొన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి. ఇది ఆ సంస్థ శక్తి’’ అని దిగ్విజయ్ పోస్ట్ పెట్టారు. దీనికి ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేయడం కొసమెరుపు. ప్రస్తుతం ఈ పోస్టు చర్చనీయాశంగా మారింది.