ఇటీవల శివాజీ హీరోయిన్ల అందాల ప్రదర్శనలపై చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిన్మయి, అనసూయ వంటి వారు శివాజీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించడం, మహిళా కమీషన్ వరకు ఈ వివాదం వెళ్లడం, ఆవెంటనే శివాజీ అసభ్య పదజాలం వాడినందుకు క్షమాపణలు సైతం చెప్పారు. అయితే ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు… నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ “ఆడవాళ్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో అది వారి ఇష్టం. ఇంకా ఎన్నాళ్లు ఆడవారిపై మగవారు ఇలాంటి వివక్షలు కొనసాగిస్తారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని తీవ్రంగా శిక్షించాలి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి నాగబాబు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.