మెల్‌బోర్న్: ఈ ఏడాది ఆస్ట్రేలియాలలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఎట్టకేలకు తోలి మూడు మ్యాచ్‌లలో చెత్త ప్రదరన చేసినా.. నాలుగో టెస్ట్ట్‌లో మాత్రం రాణించింది. ఆసీస్ విధించిన విసిరిన 175 పరుగుల విజయ లక్ష్యాన్ని 32.2 ఓవర్లలో చేధింధచి.. శభాష్ అని అనిపించుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటలో ఏకంగా 20 వికెట్లు పడ్డాయి. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 152 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ 110 పరుగులకే ఆలౌట్ అయింది.
1998లో యాషస్ మ్యాచ్ 18 వికెట్లు పడ్డాయి. ఓవరాల్‌గా టెస్టుల్లో ఆల్ టైం రికార్డు 1888 లార్డ్స్ వేదికగా జరిగిన యాషస్ టెస్ట్ మ్యాచ్‌లో నమోదైంది. ఆ మ్యాచ్‌లో తొలి రోజే ఏకంగా 27 వికెట్లు పడ్డాయి. 1902 తర్వాత మళ్లీ ఈ మ్యాచ్‌లోనే తొలి రోజు 20 వికెట్లు పడ్డాయి.
ధీనిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్‌సన్ స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా ఈ విషయంపై పోస్ట్ పెట్టారు. ‘‘స్వదేశంలో టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు మొదటిరోజు ఎక్కువగా వికెట్లు పడితే అంతా భారత్‌ను నిందించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాను కూడా నిందించాల్సిందే. ఈ విషయంలో ఆస్ట్రేలియాను కూడా నిందించాల్సిందే. ఈ విషయంలో పారదర్శకత పాటించాలి’’ అని పోస్ట్‌లో కెవిన్ పేర్కొన్నారు.