న్యూఢిల్లీ: హెచ్1 బి వీసాల నిర్ణీత ఇంటర్వూల నిరవధికంగా వాయిదా పడటం పై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసిం ది. అమెరికా ఇమిగ్రేషన్ అధికారిక యం త్రాంగానికి విషయం తెలిపింది. డిసెంబర్ మధ్య నుంచి వరుసగా జరగాల్సిన ఇంటర్వూల ప్రక్రియను వీసాల నిశిత పరిశీలన పేరిట అమెరికా అధికార యం త్రాంగం నిలిపివేసింది. వేలాది మంది వీసా దరఖాస్తుదార్లు ఈ పరిణామంతో చిక్కుల్లో పడ్డారు. తమకు పలు వర్గాల నుంచి ఈ పరిస్థితిపై విజ్ఞప్తులు అందాయ ని, వెంటనే తగు చర్య తీసుకుని, హె చ్1 బి వీసా ఇంటర్వూలపై స్పందించాలని భారతదేశం కోరింది. ప్రస్తుత పరిస్థితిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం స్పందించారు.