మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ శుక్రవారం తో ముగిసింది. కోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు ఈనెల 12వ తేదీ సిట్ అధికారులకు లొంగిపో గా, తరువాత ఈ నెల 19వ తేదీన సుప్రీం కోర్టు ఆయన కస్టడీని 25వ తేదీ వరకు పొడగించింది. దీంతో ప్రభాకర్ రావును సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం)అధికారులు 14 రోజులు పాటు విచారించారు. చివరి రోజు అధికారులు మరింత దూ డుకు పెంచారు. మాజీ సిఎస్ సోమేష్ కుమార్, మాజీ డిజిపి జితేందర్‌లను సిట్ అధికారుల బృం దం కమాండ్ కంట్రోల్‌లో విచారించారు. రివ్యూ కమిటీలో సభ్యులుగా ఉండడంతో ఫోన్ ట్యాపిం గ్ కమిటీ సభ్యులకు తెలిసి జరిగిందా, ఏ నెంబర్లను ట్యాప్ చేయడానికి అనుమతి ఇచ్చారు. అ నుమతి ఇచ్చే సమయంలో నిబంధనలు పాటించారా? లేదా? ప్రభాకర్ రావు ఎస్‌ఐబి చీఫ్‌గా ని యామకం ఎలా జరిగింది? అనే కోణంలో అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, శ్రవణ్ రావులను ప్రభాకర్ రావు ఎదురుగా ఉంచి పలు అంశాలపై సుమారు పది గంటల పాటు సిట్ అధికారులు విచారణ సాగించారు.
అందరినీ కలిపి ఒకే సారి ప్రశ్నించి సమాధానాలు రాబట్టేందుకు సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఏ ప్రశ్న అడిగినా మాజీ డిజిపి, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు నవీన్ చంద్, అనిల్ కుమార్ ఆదేశాలతోనే చేసినట్లు చెప్పారని సమాచారం. అలాగే విచారణ అధికారుల చేతికి చిక్కిన పెన్‌డ్రైవ్ పై ఆయన నోరు మెదపలేదని తెలిసింది. ఆ పెన్‌డ్రైవ్‌లో ఫోన్ ట్యాపింగ్ చేసిన 6 వేల ఫోన్ నంబర్లు ఉన్నట్టు విచారణ అధికారుల సమాచారం. దీనిపై అనుబంధ ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 14 రోజుల సుదీర్ఘ విచారణలో ప్రభాకర్‌రావు ఏం చెప్పారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. విచారణలో అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. ఈ కేసులో పెన్ డ్రైవ్‌ను సిట్ అధికారులు కీలక ఆధారంగా భావిస్తున్నారు. ప్రభాకర్ రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా పని చేసిన కాలంలో పెన్ డ్రైవ్‌లో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్లు సిట్ గుర్తించింది. పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు పెట్టి సిట్ విచారించినట్టు తెలిసింది. ఇలా ఉండగా ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావును కూడా సిట్ అధికారులు గురువారం విచారించారు. ఫోన్ ట్యాపింగ్‌కు ముందు ఆ తర్వాత ఆయన ఆర్ధిక లావాదేవీలపై సిట్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.
నేడు సుప్రీం కోర్టుకు నివేదిక
ఫోన్ ట్యాపింగ్ కేసులో 14 రోజుల ప్రభాకర్ రావు కస్టడి ముగియడంతో విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను సిట్ బృందం శుక్రవారం సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. చివరి రోజు వరుస విచారణలు ఒక వైపు, మరోవైపు డాక్యుమెంటేషన్ పనుల్లో అధికాకారులు నిమగ్నమయ్యారు. సిట్ చీఫ్ విసి సజ్జనార్‌తో అధికారులు భేటీ అయి సుప్రీంకోర్టుకు తెలపాల్సిన అంశాల పై చర్చించారు. ఈ కేసులో పూర్తి నివేదికను సుప్రీంకోర్టులో సిట్ సమర్పించనుంది.