తన అద్భుత బ్యాటింగ్‌తో భారత క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న భారత యువ సంచలనం, బిహార్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి అరుదైన పురస్కారం లభించింది. చిన్న వయసులో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న 15 ఏళ్ల వైభవ్‌కు ప్రతిష్ఠాత్మకమైన ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు లభించింది. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వైభవ్ ఈ అవార్డును అందుకున్నాడు. కిందటి ఐపిఎల్ సీజన్‌తో పాటు అండర్19 క్రికెట్ టోర్నమెంట్‌లలో వైభవ్ విధ్వంసక బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 80 బంతుల్లోనే 190 పరుగులు చేసి ఔరా అనిపించాడు.