శ్రీలంక మహిళలతో శుక్రవారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా మరో రెండు మ్యాచ్‌లు మిగిలివుండగానే 30 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. భారత్‌కు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఓపెనర్ హసిని పెరీరా (25), ఇమేశా దులాని (27), కవిశా దిల్హన్ (20), కౌశాని (19) పరుగులు చేశారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ నాలుగు, దీప్తి శర్మ మూడు వికెట్లను పడగొట్టారు. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 13.2 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ షఫాలీ వర్మ 42 బంతుల్లోనే అజేయంగా (79) పరుగులు చేసింది. ఆమెకు హర్మన్‌ప్రీత్ కౌర్ 21 (నాటౌట్) అండగా నిలిచింది.