మన తెలంగాణ / హైదరాబాద్/మెదక్/మాదాపూర్ : క్రిస్‌మస్ వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. గురువారం క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పలుచర్చిల్లో ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో మొదలయ్యాయి. ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చి పరిస ర ప్రాంగణాలు పండుగ వాతావరణం తో కళకళలాడాయి. వేడుకల ప్రారంభ సూ చకంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి చుట్టూ శిలువ ఊరేగింపును నిర్వహించారు. శిలువను ముందు ఉంచి క్రైస్తవులు ప్రార్థనా గీతాలు ఆలపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నా రు. ఊరేగింపు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని చర్చి ప్రాంగణాలు ఆధ్యాత్మిక సందేశాలతో మార్మోగాయి. ‘శాంతి, ప్రేమ, సోదరభావం’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ కార్యక్రమం సాగింది.
క్రి స్మస్ వేడుకల ప్రారంభ ఆరాధనకు చర్చిలకు క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. ఉ దయం నిర్వహించిన మొదటి ఆరాధనకు చర్చి ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. చర్చి ప్రాంగణాలు కిక్కిరిసి పోవడంతో బయట ప్రాంగణంలో కూడా భక్తులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందుకు అనుగుణంగా చర్చిల నిర్వాహకులు అన్ని ఏ ర్పాట్లు చేశారు. చర్చి ప్రాంగణాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. చర్చి ప్రధాన ద్వా రాలను విద్యుత్ కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చర్చిల ప్రాంగణాలు విద్యుత్ దీపాలతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా గురువారం క్రిస్మస్ వేడుకలు జరిగాయి. సిటీలోని పలు చారిత్రాత్మక చర్చిలలో క్రిస్టియన్స్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సికింద్రాబాద్, అబిడ్స్‌లోని చారిత్రాత్మక చర్చిలలో తెల్లవారుజాము నుంచే క్రిస్మస్ సందడి నెలకొంది.
సీఎస్‌ఐ చర్చిలో క్రిస్‌మస్ వేడుకలు
మెదక్‌లోని ప్రసిద్ధ సీఎస్‌ఐ చర్చిలో గురువారం క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. చర్చి చుట్టూ శిలువ ఊరేగింపు, ప్రత్యేక ప్రార్థనలతో వేడుకలు ఆరంభించారు. మొదటి ఆరాధనలో భక్తులు భారీగా పాల్గొన్నారు. దైవ సందేశాన్ని ఇన్‌చార్జి బిషప్ రెవరెండ్ రూబిన్ మార్క్ వినిపించారు. ఆయన ప్రసంగంలో ఏసు క్రీస్తు జన్మ వెనుక ఉన్న అసలు సందేశాన్ని వివరించారు. ప్రేమ, క్షమ, త్యాగం, మానవత్వం వంటి విలువలు ఈ ప్రపంచానికి ఎంత అవసరమో ఆయన తన ఉపన్యాసంలో స్పష్టంగా చెప్పారు. సమాజంలో పెరుగుతున్న ద్వేషం, అసహనం మధ్య క్రిస్మస్ పండుగ మనకు శాంతి మార్గాన్ని చూపుతుందని ఆయన పేర్కొన్నారు. వి విధ రంగు రంగుల విద్యుత్ కాంతులతో చర్చి ప్రాంగణం శోభాయమానంగా ఉం ది. క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. చర్చిలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలతో సందడిగా మారాయి. చర్చి లోపల కూడా ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. ఏసు క్రీస్తు జన్మ ఘ ట్టాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక ఏ ర్పాటు చేశారు. పండుగ వాతావరణంలో పిల్లల సందడి చర్చికి మరింత శోభను తీసుకువచ్చింది. పేదలకు ఆహార పంపిణీ, అవసరమైన వారికి సహాయం వంటి సేవా కార్యక్రమాలను కూడా చర్చి ఆధ్వర్యంలో చేపట్టారు. మెదక్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా, సమీప గ్రామాలు, పట్టణాల నుంచి కూడా క్రైస్తవులు భారీగా చర్చికి తరలివచ్చారు.
కల్వరి టెంపుల్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
మియాపూర్‌లోని కల్వరి టెంపుల్‌లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కల్వరి టెంపుల్ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. గురువారం తెల్లవారు జాము నుండి భక్తులు పెద్ద సం ఖ్యలో కల్వరి టెంపులు తరలిరావడం జరిగింది. కల్వరి టెంపుల్‌ను విద్యుత్ లైటింగ్‌తో అందంగా అలంకరించారు. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రా ష్ట్రల నుండి అనేక మంది భక్తులు కల్వరి టెం పుల్‌కు తరలివచ్చారు. ఉదయం 6 గంటల ప్రార్థనతో ప్రారంభమైన ప్రత్యేక ఆరాధనలు సాయంత్రం వరకు 4 ఆరాధనలు కొనసాగాయి.మియాపూర్ ట్రాఫిక్ పోలీస్, కల్వరి టెంపుల్ వాలంటీర్లు సేవలు అందించి ట్రాఫిక్ నియంత్రించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నారు. అనంతరం డాక్టర్ బ్రదర్ పి. సతీష్‌కుమార్ కల్వరి టెంపుల్‌కు వచ్చిన భక్తులకు క్రీస్తు సందేశాలు చేశారు. అనంతరం క్రీస్తు జననం నాటకం భక్తులను ఆకట్టుకుంది.