నిషేధిత మాంజా తగిలి బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మేడ్చల్ జిల్లా కీసరలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం .. బైక్ పై వెళ్తున్న బాలుడు జశ్వంత్ రెడ్డి మెడకు మాంజా చుట్టుకొవడంతో బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో జశ్వంత్ రెడ్డి మెడకు తీవ్రంగా గాయమైంది. అది గమనించిన స్థానికులు వెంటనే జశ్వంత్ చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మెడకు 19 కుట్లు వేశారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకొవాలని, నిషేధిత మాంజాను విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకొవాలని స్థానికులు డిమాండ్ చేశారు.