హైదరాబాద్: అధికార, ప్రతిపక్షాల మధ్య తిట్ల పురాణమే ఎక్కువగా సాగుతోందని కేంద్రమంత్రి బండిసంజయ్ తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో అభివృద్ధి మాట వినిపించట్లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్ ప్రజా సమస్యలు వదిలేసి బూతు పురాణం అందుకున్నారని, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి అసభ్యకరంగా దూషించుకున్నారని విమర్శించారు. తెలంగాణకు కావాల్సింది ఉద్యోగాలు, పెట్టుబడులు, రైతులకు మద్దతు అని.. తెలియజేశారు. పాలన కోసం ప్రజలు ఓటేస్తే 2014 నుంచి మురికి రాజకీయాలే నడుస్తున్నాయని, అభివృద్ధిపై చర్యను పక్కన పెట్టి గొడవలతో కాలక్షేపం చేయడం దురదృష్టకరమని బండి సంజయ్ పేర్కొన్నారు.