రాష్ట్రంలో జనవరి 11వ తేదీ నుంచి 15 వరకు ఐదు రోజులపాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. తిరిగి వచ్చే నెల 16వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జనవరి 10న రెండో శనివారం కావడంతో అకడమిక్ క్యాలెండర్‌లో ప్రకటించిన సెలవుల కంటే ఒకరోజు ముందుగానే విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 10 నుంచి 18 వరకు తొమ్మిది రోజులపాటు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటింటిన విషయం తెలిసిందే.