మన తెలంగాణ/హైదరాబాద్: సంక్రాంతి స మీపిస్తున్న తరుణంలో మళ్లీ చైనా మాంజా ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రజ లు, పక్షుల ప్రాణాలతో చెలాగాట మాడుతోన్న చైనా మాంజా అమ్మకాల పట్ల అధికార యాం త్రాంగ అలసత్వం ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ పట్ల ప్రభుత్వం చూపిస్తోన్న శ్రద్ధాలో చైనా మాంజాపై చూపించడం లేదన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల సంభవించిన పలు ఘటనలలో చైనా మాంజా వల్ల ప్రాణాపాయానికి గు రైన వాహనదారులు ఆస్పత్రులలో చికిత్స పొం దుతున్నారు. మొన్న హస్తినాపురంలో బైక్‌పై వెళ్తోన్న దంపతులు, నిన్న నిజాంపేటలో, తా జాగా శుక్రవారం కీసరలో చైనా మాంజా వల్ల మెడ తెగిన బాధితులు ప్రాణాపాయ స్థితిలో చి కిత్స పొందుతున్నా, అధికారులు కనీసం ఆ యా ప్రాంతాలలో చైనా మాంజా విక్రయించే షాపులపై తనఖీలు చేయకపోవడం వారి నిర్లక్షవైఖరికి ఇంతకంటే మరో నిదర్శనం ఏముంటుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణవ్యాప్తంగా సంక్రాంతికి ముందు పతంగు ల ఎగరేయడం అనవాయితీగా వస్తోంది. హై దరాబాద్‌లో దీనిని మరింత పెద్దఎత్తునా నిర్వహించుకోవడం జరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా సంక్రాంతికి ముందు నెక్లస్ రోడ్ లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివెల్ నిర్వహిస్తోంది.
ఇలా ఉండగా పతంగులు ఎగుర వేసేందుకు చిన్నా పెద్ద తేడా లేకుండా ఆసక్తి చూపు తుంటారు. నైలాన్ దారంతో తయారు చేసిన ఈ మాంజా చుట్టుకొని పక్షులు, మూగజీవాలతో పాటు మనుషులూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వీటికి సాధారణ దారాన్ని వినియోగించడంవల్ల పెద్దగా ప్రమాదకరమేమి కాదు. కానీ ఇతరులు ఎగరవేసే పతంగులను తెంచటానికి నైలాన్ దారానికి గాజు పొడితో జిగట రసాయన పదార్థాన్ని పూసిన దారాన్ని వినియోగిస్తారు. దీనినే చైనా మాంజా అంటారు. మార్కెట్‌లో దీనికి పెద్ద ఎత్తునా డిమాండ్ ఉండటంతో హైదరాబాద్ పాతబస్తీలో కొన్ని ప్రాంతాలలో రహస్య కుటీర పరిశ్రమగా మారింది. ఇక్కడ తయారు చేసిన దానికంటే ముంబై, పూనే, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలలో చౌకతో పాటు నాణ్యతతో లభించే చైనా మాంజాకు హైదరాబాద్‌లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కోట్లలో సాగే ఈ వ్యాపారానికి హైదరాబాద్‌లో హోల్‌సేల్ డీలర్లు ఉంటారు. వారు సీజన్‌కు, తనఖీలకు ముందే వీటిని పెద్ద ఎత్తున తెప్పించుకొని గోదామ్‌లో భద్రపరుచుకుంటారు. ప్రతి ఏటా అధికారుల తనఖీల హెచ్చుతగ్గుల ఆధారంగా విక్రయాలు ఉంటాయి. కోట్లలో సాగే ఈ వ్యాపారం నుంచి ముడుపులకు అలవాటు పడిన ఫారెస్టు, పోలీసు అధికారులు మొక్కుబడిగా తనఖీలు నిర్వహిస్తుంటారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా తీసుకుంటే తప్ప అధికారులలో ఆస్థాయిలో చలనం ఉండదు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చైనా మాంజా విక్రయాలపై ఉక్కుపాదం మోపి దాదాపు అరికట్టిందని చెప్పవచ్చు. చైనా మాంజాపై నిషేధం విధిస్తూ గత ప్రభుత్వం 2016 జనవరి 13న ప్రభుత్వం జీవో 2ను వెలువరించింది. దీని ప్రకారం చైనా మాంజాను విక్ర యిస్తూ పట్టుబడితే రూ.లక్ష జరిమానా, జైలు శిక్ష విధించవచ్చు.అయితే దీనిపై నిషేదం ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చైనా మాంజా విక్రయాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. మనుషుల ప్రాణాలకే కాకుండా పక్షుల ప్రాణాలకు కూడా ప్రాణాంతకంగా మారిన ఈ అంశంపై అటవీశాఖ ఇప్పటి వరకు ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు. ‘
ఒక్క సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. దీంతో అధికారుల సరైన నిఘా, నియంత్రణ లేకపోవడంతో మాంజా విక్రయాలకు ఈసారి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. హైదరాబాద్‌లో పతంగులు విక్రయించే షాపులలో చైనా మాంజా బహాటంగానే విక్రయిస్తున్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడంతో చైనా మాంజా విక్రయించే వ్యాపారుల పాలిట వరంగా, ప్రజల ప్రాణాలపాలిట శాపంగా మారింది. తాజాగా నిషేధిత చైనా మాంజా వల్ల శుక్రవారం మేడ్చెల్ జిల్లా కీసరలో జరిగిన ప్రమాదం లో జశ్వంత్ రెడ్డి అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా అతని మెడకు చైనా మాంజా చుట్టుకుంది. దాంతో అతిని గొంతు లోతుగా కోసుకుపోయింది. నైలాన్, గాజు పొడితో తయారు చేసిన ఆ మాంజా బలంగా ఉండటంతో మెడ భాగంలో లోతైన గాయ మైంది. వెంట నే స్థానికులు స్పందించి అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి 19 కుట్లు వేసి ప్రాణాలు కాపాడారు. దారం ఇంకొం చెం లోతుగా దిగి ఉంటే ప్రాణానికే ప్రమాదం వాటిల్లేదని వైద్యులు అంటున్నారు.గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చైనా మాంజా విరివిగా అందుబాటులో ఉందని చెబుతున్నారు. కొందరు ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ద్వారా కూడా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నట్టు సమాచారం. హైదరాబాద్ పాతబస్తీ లోని మంగళ్‌హాట్, పురానా పూల్, ధూల్‌పేట, పాతబస్తీ లోని పలు ప్రాంతాల్లో ఎప్పటి మాదిరిగానే నిషేధిత చైనా మాంజా విక్రయాలు కొనసాగుతున్నట్లు సమాచారం. దీని ఫలితంగానే ఇటీవల హైదరాబాద్‌లో పలు ప్రమాదాలు సంభవించడానికి అధికారుల పర్యవేక్షణా, నిఘా లోపించడమే కారణమనే విమర్శలు వస్తున్నాయి.