ఒట్టావా: కెనడా దేశం టొరంటో ప్రాంతం స్కార్ బొరౌగ్ విశ్వవిద్యాలయంలోని భారతీయ విద్యార్థిని కాల్చి చంపారు. ఓల్డ్ కింగ్ స్టన్ రోడ్డులోని స్థానిక హైల్యాండ్ క్రీక్ ట్రెయిల్ వద్ద శివాంక్ అవస్తీ అనే భారతీయ విద్యార్థి నడుచుకుంటూ వెళ్తుండగా అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాత్కాలికంగా కళాశాల క్యాంపస్‌ను మూసివేశారు. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధిత కుటుంబానికి సహాయక సహకారాలు అందిస్తామని తెలిపింది.