ముంబై : దట్టమైన పొగమంచుతో తక్కువ దృశ్యమానత కారణంగా దేశ వ్యాప్తంగా 67 విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది. బెంగళూరు, వారణాసి, అగర్తల, చండీగఢ్ తదితర నగరాల్లో వాతావరణం అనుకూలించక పోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. డిసెంబర్ 10 నుంచి ఇండిగో తరచుగా విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. ఫిబ్రవరి 10 వరకు ఈ పరిస్థితి ఉండవచ్చని డిజిసిఎ వెల్లడించింది.