ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్) 2026 హాల్ టికెట్లు శనివారం(డిసెంబర్ 27) విడుదల కానున్నాయి. జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. టెట్ పరీక్షకు మొత్తం 2,37,754 దరఖాస్తులు రాగా, అందులో పేపర్ 1కు 85,538, పేపర్ 2కు 1,52,216 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. ఈసారి టెట్‌కు 1,66,084 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేసుకోగా, అందులో పేపర్ 1కు 58,149 మంది, పేపర్ 2కు 1,52,216 మంది దరఖాస్తు చేసుకున్నారు.