సుడిగాలి సుధీర్‌గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ హీరోగా ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న చిత్రం హైలెస్సో. వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కోర్ట్ సినిమాలో తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్న శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వస్తోంది.
ప్రముఖ కన్నడ నటి అక్షర గౌడ ఈ కీలక పాత్రలో కనిపించనున్నారు. బుధవారం అక్షరగౌడకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మేకర్స్ వడ్డీ కాంతమ్మగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వడ్డీ కాంతమ్మ గెటప్ లో అక్షరగౌడ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హై లెస్సో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.