సినీ హీరోయిన్ల దుస్తుల విషయంలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి అనసూయ.. శివాజీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూనే అనసూయ పేరును ప్రస్తావించారు. దీంతో ఆగ్రహానికి గురైన అనసూయ.. వరుస పోస్ట్‌లతో స్పందించారు. ఈ క్రమంలో తాజాగా ఎక్స్ వేదికగా కొన్ని పోస్ట్‌లు పెట్టారు.
‘‘ప్రస్తుతం జరుగుతున్న దాన్ని పక్కనపెడితే.. నేను ఏ విషయంలోనైనా నా అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తాను. దేనికీ ప్రభావితం కాకుడా ధైర్యంగా నిలబడతాను. ఎన్నో ఏళ్ల నుంచి సమాజంలో నిర్లక్ష్యం చేసిన అంశాన్ని అర్థమయ్యేలా చెప్పి, దానిపై పోరాటం చేయడమే నా ఉద్దేశం. ఎన్ని జరిగినా చెప్పింది చేయడానికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. మీరు అలా అసూయపడుతూనే ఉండండి.. మేం మరింత శక్తిమంతంగా, ఆకర్షణీయంగా ముందుకు సాగుతాం’’ అని అనసూయ పోస్ట్ చేశారు.