హైదరాబాద్: శంషాబాద్‌లోని కవేలిగూడ వద్ద దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిపై కత్తితో దారుణంగా పొడిచారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడు వెంకటాపురానికి చెందిన మహేశ్‌గా గుర్తించగా.. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలిలో క్లూస్ టీమ్‌తో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.