అమరావతి: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, దివంగత ప్రధాని వాజ్‌పేయీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో వాజ్‌పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆర్థిక సంస్కరణలను ప్రారంభించిన దివంగత ప్రధాని పివి నరసింహారావు మన తెలుగు బిడ్డ అని గుర్తు చేశారు. పివి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలకు దేశ ప్రగతికి వాజ్‌పేయీ తీవ్రంగా కృషి చేశారన్నారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించారని, భారత్‌ను అణ్వాయుధ శక్తిగా నిలబెట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాలు ఎపి రాజధాని అమరావతికి ఇచ్చారని, రైతులు భూములు ఇచ్చేందుకు ఇవాళ అన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
భారత దేశం గర్వించే నాయకులలో అరుదైన నేత వాజ్‌పేయీ అని మెచ్చుకున్నారు. 26 జిల్లా కేంద్రాల్లో వాజ్‌పేయీ విగ్రహాలు పెట్టాలని కోరారని, అందరూ కలిసి పని చేసి ఒక చరిత్ర సృష్టించారని, అమరావతి వాజ్‌పేయీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని, వాజ్‌పేయీ చేసిన పనులు శాశ్వతంగా ప్రజలకు గుర్తుండేలా స్మృతివనం ఏర్పాటు చేస్తామని, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నామని, చరిచరినాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చేనేత ఎన్‌టిఆర్ అని, నేషనల్ ఫ్రంట్ ద్వారా యాంటీ కాంగ్రెస్‌కు ఎన్‌టిఆర్ బీజం వేశారని, తాను ఒకప్పుడు ఫోన్ విషయం మాట్లాడితే చాలా మంది ఎగతాళి చేసేవాళ్లు అని, నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్‌బోన్ టెలికామ్ సెక్టార్ అని చంద్రబాబు తెలియజేశారు.