భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్‌పూర్ మండలంలోని ఓ గ్రామంలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగింది. కొన్ని నెలలుగా మానసిక వికలాంగురాలైన యువతిపై ఓ యువకుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. కోతి కరవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి బాధితురాలును కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వైద్యులు అనుమానంతో పరీక్షలు చేయడంతో ఐదు నెలల గర్భవతి అని నిర్థారణ అయ్యింది. అదే గ్రామానికి చెందిన పరమేష్ అనే వ్యక్తి బెదిరించి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. పరమేశ్‌తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు గ్రామస్థుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టగా గర్భం తీయించడానికి తొమ్మిది లక్షల రూపాయల బేరం కుదిరినట్లుగా సమాచారం. గతంలో మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో దళిత యువతిపై హత్యాచారం మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.