మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ, అదనపు బా ధ్యతలను అప్పగిస్త్తూ ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సిఎంఓలోని ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెం ట్ సెల్ ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్‌ను మెట్రోపాలిటిన్ ఏరియా, అర్బన్ డెవలెప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ అయ్యా రు. పర్యాటక, క్రీడల శాఖ, ఆర్కియాలజీ డైరక్టర్‌గా నిర్వహిస్తున్న బాధ్యతలు ఆయన యధాతధంగా కొనసాగించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొం ది. అలాగే జయేష్ రంజన్ నిర్వహిస్తున్న అదనపు బాధ్యతల్లోని స్మార్ట్ ప్రోయాక్టివ్ అండ్ ఎఫక్టివ్ డెలివరీ (స్పీడ్) బాధ్యతలను ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి కె.రామకృష్ణారావు వద్దే ఉంటాయి. జిహెచ్‌ఎంసి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా బోర్కేడ్ హేమంత్ సహదేవ్‌రావు, జిహెచ్‌ఎంసి కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా అపూర్వ్ చౌహాన్‌ను నియమించారు. కుత్బుల్లాపూర్ జోన ల్ కమిషనర్‌గా సందీప్‌కుమార్ జా, చార్మినార్ జోనల్ కమిషనర్‌గా ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, గోల్కొం డ జోనల్ కమిషనర్‌గా జి.ముకుందారెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా ప్రియాంక అలా, రాజేంద్రనగర్ జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్‌గా రవికిరణ్,
శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా కె.చంద్రకళ, ఎల్‌బినగర్ జోనల్ కమిషనర్ గా హేమంత కేశవ్ పాటిల్ బదిలీ అయ్యారు. మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్‌గా సంచిత్ గం గ్వార్, ఉప్పల్ జోనల్ కమిషనర్‌గా రాధికా గు ప్తా బదిలీ అయ్యారు. టిజిపిఎస్‌సి కార్యదర్శిగా ఎం.హరిత నియమితులయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేస్తున్న గరి మా అగర్వాల్‌కు జిల్లా కలెక్టర్, మెజిస్టేట్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చే శారు. ఇండస్ట్రీ అండ్ ఇన్‌వెస్ట్‌మెంట్ సెల్, స్పీడ్ విభాగం అదనపు సీఈఓగా భావేశ్ మిశ్రాకు అ దనపు బాధ్యతలు అప్పగించారు. మూసీనది అ భివృద్ధి సంస్థ లిమిడెట్ ఎండిగా ఈవి నర్సింహారెడ్డిని బదిలీ చేసింది. నారాయణపేట్ అదనపు క లెక్టర్‌గా నారాయణ అమిత్ మలెంపాటిని బదిలీ చేయగా, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ డైరక్టర్, ఉపాధి, శిక్షణ పదవికి అదనపు బాధ్యతలను ఏ.నిర్మల కాంతి వెస్లీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మైనార్టీస్ ఫైనాన్స్ కా ర్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండిగా బి.షఫియుల్లాకు అదనపు బాధ్యతలు అప్పగించగా, హైదరాబాద్ అదనపు కలెక్టర్‌గా జి.జితేందర్‌రెడ్డిని నియమించింది. హైదరాబాద్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.కదిరవన్, షెడ్యూల్డ్ కో ఆపరేటివ్ డెవలెప్‌మెంట్ లిమిటెడ్ విసి, ఎండిగా డి.హన్మంత్ నా యక్, టిజిఐఐసి (ఎల్‌ఏ) ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా బి.వీరారెడ్డి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యదర్శి గా జి.లింగ్యానాయక్‌ను నియమించింది.