బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా హిరియూర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోర్లతు గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో 17 మంది సజీవదహనమయ్యారు. పలువురు ప్రయాణికులు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా కాలి బూడిదగా మారింది. 29 మంది ప్రయాణికులతో బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా సిరా- హిరియూరు మధ్య జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. డివైడర్ దాటి రాంగ్‌రూట్‌లో బస్సును లారీ ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఎస్ పి రంజిత్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై హిరియూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు