మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. నారాయణపేట జిల్లా మరికల్‌కు చెందిన ప్రైవేటు స్కూల్ బస్సు విద్యార్థులతో వెళ్తూ ఉండగా.. వెనుక నుంచి ఓ వాహనం ఢీకొంది. దీంతో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.