ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు అపార్టు మెంటులోని పదో అంతస్తు నుంచి పడిన ప్రాణాలతో బయటపడిన సంఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. 57సంవత్సరాల నితిన్ భాయ్ అదియా సూరత్ లోని జహంగిర్ పూర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అపార్టు మెంటులోని పదో అంతస్తులో కిటికి పక్కన నిద్రపోయాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కిందకు జారిపడగా ఎనిమిదో అంతస్తులోని కిటికి గ్రిల్ లో అతని కాలు ఇరుక్కపోయింది. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సేప్టీ బెల్టు సాయంతో అతడిని కాపాడారు.