హోస్టన్: టెక్సాస్ న్యూట్రిషన్ అడ్వైజరీ కమిటీకి భారత సంతతి ఫిజీషియన్ పద్మజా పటేల్‌ను గవర్నర్ గ్రెగ్ అబోట్ నియమించారు. 2029 సెప్టెంబరు 1 వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. భారత్ లోని బరోడా మెడికల్ కాలేజీ నుంచి మెడికల్ డిగ్రీ పొందిన పద్మజా పటేల్ అమెరికాలో తన శిక్షణ పూర్తి చేశారు. నుడ్జ్ హెల్త్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, అమెరికన్ కాలేజీ ఆఫ్ లైఫ్‌స్టైల్ మెడిసిన్ ప్రెసిడెంట్‌గా ఉన్న పటేల్ టెక్సాస్ మెడికల్ అసోసియేషన్ అనుబంధంగా ఉన్న మిడ్‌ల్యాండ్ క్వాలిటీ అలియన్స్, హెల్త్‌సిటీ మిడ్‌ల్యాండ్, అమెరికన్ మెడికల్ అసోసియేషన్, అమెరికన్ కాలేజీ ఆఫ్ ఫిజిషియన్స్‌లో నాయకత్వం కూడా నిర్వహించారు. ప్రస్తుతం మిడ్‌ల్యాండ్‌కు చెందిన ఆమె వ్యాధి నియంత్రణ, మొండి వ్యాధుల నిర్వహణ చికిత్సల్లో పేరు పొందారు.