హైదరాబాద్: ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాలని.. దిగజారి కాదని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. మాజీ సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష సరికాదని అన్నారు. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటి వాటాల అంశంలో తప్పు చేసిందే కెసిఆర్ అని.. తెలంగాణకు పట్టిన పెద్ద శని మాజీ సిఎం కెసిఆర్ కుటుంబం అని విమర్శించారు. శని కాబట్టే కెసిఆర్ ను ప్రజలు ఫామ్ హౌస్ కు పరిమితం చేశారని, రేవంత్ తిట్టడం వెనుక.. కెసిఆర్ కు సానుభూతి పెంచే కుట్ర ఉందని బండి తెలియజేశారు. తెలంగాణలో ఇద్దరు మంత్రులు వేల కోట్ల ఆస్తులు కూడబెట్టకుంటున్నారని, ఇద్దరు మంత్రులపై కేంద్ర దర్యాప్తు సంస్థల నిఘా ఉందని పేర్కొన్నారు. ఎప్పటికైనా ఆ ఇద్దరు మంత్రులు జైలుకెళ్లడం ఖాయమని బండి సంజయ్ హెచ్చరించారు.