చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నారి నారి నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవ్వులు, భావోద్వేగాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా కలయికలో పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా జనవరి 14వ తేదీన సాయంత్రం 5:49 గంటలకు ఫస్ట్ షోతో థియేటర్లలో విడుదల కానుంది.