మన తెలంగాణ/నల్గొండ రూరల్: అంతర్గతం గా ఎలా ఉన్నా బాహ్య ప్రపంచానికి క్రమశిక్షణ కు మారుపేరుగా నిలిచే భారతీయ జనతా పా ర్టీలో ముసలం పుట్టింది. నల్లగొండ బిజెపిలో గతకొంత కాలంగా స్తబ్దుగా ఉన్న అంతర్గత కలహాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. నేతల మధ్య వైరుధ్యాలు చికిలి చిలికి గాలివానలా మారాయి. గురువారం నల్లగొండ జిల్లా బిజెపి కార్యాలయంలో నేతలు బాహాబాహీకి దిగారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి వేడుకల సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షి త్‌రెడ్డి, బిజెపి నల్లగొండ పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్‌ల మధ్య కోల్ వార్ ఘర్షణ వాతావరణానికి దారితీసింది.పార్టీ కార్యక్రమం నిర్వహణలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, మరో నాయకుడు పిల్లి రామరాజు మధ్య నెలకొన్న బేధాభిప్రాయం కాస్తా నాగం అనుచరుడు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పకీరు మోహన్ రెడ్డి ఏకంగా పిల్లి రామరాజు యాదవ్‌పై దాడికి దిగే స్థా యికి చేరుకుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న నాగం వర్షిత్‌రెడ్డి ఈ దాడిని అడ్డుకునే ప్రయ త్నం చేయకపోగా మోహన్ రెడ్డికి మద్దతు
పలికాడని రామరాజు యాదవ్ ఆరోపించడం గమనార్హం. బిజెపి కార్యాలయంలో జరిగిన తాజా ఎపిసోడ్ కథాకమీ షు ఇలా ఉంది. మాజీ ప్రధాని వాజ్ పే యి జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఇటీవల బీజేపీ నుంచి గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అనుమతితో పిల్లి రామ రాజు యాదవ్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు.ఈ విషయంలో అనుకున్న కార్యక్ర మాన్ని రద్దు చేసుకోవాలంటూ బుధవారం అర్ధరాత్రి నాగం వర్షిత్‌రెడ్డి ఫోన్ చేసి ఆదేశించాడని పిల్లి రామరాజు యాదవ్ ఆరోపిస్తున్నారు. అయితే గురువారం ఉద యం పార్టీ కార్యాలయంలో వాజ్ పేయి జయంతి వేడుకలు నిర్వహిస్తున్న సమయంలోనే నాగం వర్షిత్‌రెడ్డి మాత్రం సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పాడని పిల్లి రామరాజు చెబుతు న్నారు. తనను సన్మాన కార్యక్రమం నిర్వ హించవద్దని చెప్పి మీరి ప్పుడు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించడంతో నాగం వర్షిత్‌రెడ్డి, పిల్లి రామరాజు యాదవ్ మధ్య మాటలయుద్ధo ప్రారంభమైంది.
ఈ క్రమంలో నాగం వర్షిత్‌రెడ్డి తర పున వకాల్తా పుచ్చుకున్న జిల్లా పా ర్టీ ఉపాధ్యక్షుడు పకీరు మోహన్ రె డ్డి మధ్యలో కలుగజేసుకొని రామ రాజు యాదవ్ పై ఉన్నపళంగా భౌ తిక దాడికి దిగారు. దీంతో తనపై జరిగిన దాడితో అవాక్కయిన పిల్లి రామరాజు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా పార్టీ కార్యాలయంలో తన అనుచరులతో ఆందో ళనకు దిగారు. నల్లగొండ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి పెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి 28 వేల ఓట్లను తెచ్చుకున్నానని గుర్తు చేస్తూ బిజెపిపై ఉన్న అభిమానంతో పార్టీలో చేరానని చెప్పారు. ఈ క్రమంలో పార్టీ కార్యాల యంలోనే బైఠాయించిన పిల్లి రామరాజు ఆగ్రహంతో ఊగిపోతూ అయితే నాగం వర్షిత్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యాడని ఆరోపణలు గుప్పిస్తూ తాను తలచు కుంటే క్షణాల్లో ప్రతి దాడికి దిగగలుగుతానని ఛాలెంజ్ చేస్తూ పార్టీ నాయకులను హెచ్చరిం చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో పార్టీ కో సం కష్టపడే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ మాటల యుద్ధం కొనసాగిం చాడు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం తనకు ఎవరు పోటీ ఉండొద్దన్న దురుద్దేశంతో బలమైన పార్టీ నాయకు లను కట్టడి చేయాలన్న వర్షిత్ రెడ్డి దూరం పెడుతు న్నాడని ఆరోపిం చారు. తనపై దాడి చేసిన ఫకీర్ మోహన్ రెడ్డి పా ర్టీ నాయకుల సమక్షంలో తనకు క్షమాపణ చెప్పేంత వరకు తన ఆందోళనను విరమించేది లేదని పార్టీ కార్యాలయంలోనే పిల్లి రామ రాజు యాదవ్ చాలా సేపు పట్టుబడుతూ బైఠాయించారు.
ఫోటో, వీడియో జర్నలిస్టుల నిరసన
బిజెపి కార్యాలయంలో పార్టీ నేతల మధ్య బాహాబాహీ విషయంలో నెల కొన్న వాతావరణం ఫోటో జర్నలిస్టుల నిరసనలతో మరింత వేడెక్కింది. నేతల మధ్య బాహాబాహీకి సంబం ధించిన ఫోటోలను చిత్రీకరించిన ఫోటో, వీడియో జర్నలిస్టులతో బిజెపి జిల్లా అధ్యక్షు డు నాగం వర్షిత్‌రె డ్డి వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. పార్టీ నేతల ఘర్షణ వాతావరణం సమయంలో అక్కడే ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి ఈ గొడవను రికార్డు చేయగా నాగం వర్షిత్‌రెడ్డి మీడియా ప్రతినిధి నుంచి బలవంతంగా చేసి కెమెరాను గుంజుకొని చిప్‌ను ఫార్మాట్ చేయ డం పెద్ద గందరగోళానికి దారితీ సింది. దీంతో నాగం వర్షిత్ రెడ్డి వ్యవహార శైలిని నిరసిస్తూ మరోవైపు జర్న లిస్టులు తమపై జరిగిన దాడిని నిరసిస్తూ కార్యాలయం మెయిన్ గేటు వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. వర్షిత్‌రెడ్డి దిగివచ్చి జర్నలిస్టులను క్షమాపణ కోరడంతో జర్నలిస్టులకు వర్షిత్ రెడ్డికి ఉన్న వివాదం సద్దుమణిగింది.. ఒకవైపు పార్టీ నేతల మధ్య వివాదం, మరోవైపు జర్నలిస్టులు ఆందోళనలతో చేప ట్టడంతో బిజెపి కార్యాలయం కొద్దిసేపు రణరంగo గా మారింది. ఈ క్రమంలో పోలీసు లు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తె చ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఎట్టకేలకు షార్ట్ ఫిలిం తరహా ఎపి సో డ్ కు తెరపడడoతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.