మన తెలంగాణ / హైదరాబాద్ : నీటి హక్కులపై రాజీపడ్డ నిర్వాకాన్ని బయటపెడితే తట్టుకోలేక చి ల్లర డైలాగ్‌లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిందు లు తొక్కుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తిట్లు, బూతులతో డైవర్షన్ డ్రామాలు, తమాషాలు ప్రతీసారి నడవవని హిత వు పిలికారు. జనం అన్నీ గమనిస్తున్నారని, సంద ర్భం వచ్చినప్పుడు తొక్కి నార తీస్తారని పేర్కొన్నా రు. ఆస్తి కోసం సొంత చెల్లిని మెడలు పట్టుకుని బ యటకు నెట్టిన వ్యక్తి కేటీఆర్ అని, ఆమెకే సమాధా నం చెప్పలేనోడు తనకు సవాలు విసురుతుండటం విడ్డూరంగా ఉందని కోస్గీ సభలో సీఎం రేవంత్ రె డ్డి సంచలన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా కౌం టర్ ఇచ్చారు. జల హక్కులను కాపాడటం చేతకాక పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నర ని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక కారుకూతలు కూస్తున్నరని ధ్వజమెత్తారు. తెలంగాణ సోయిలేని..రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలే ని కోవర్ట్ బతుకు అని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అడ్డంగా దొరికిపోవడం..ఆగమాగం కావ డం.. అడ్డదిడ్డంగా వాగడం నీకు అలవాటే కదా అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు.
విధ్వంసక పాలనతో ప్రజలను చావ గొడుతున్నారని, వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నావా అని ఆక్షేపించారు. సభ్యత, సంస్కారం లేని నీచమైన వాగుడు ను చూసి జనం చీదరించుకుంటున్నా.. ఛీకొడుతున్నా ఇంకా మారలేదన్నారు. పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పనికిమాలిన శపథాలు చేయడం..పత్తా లేకుండా పారిపోవడం వెన్నతో పెట్టిన విద్య కదా అంటూ కెటిఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శాసనసభలో, జనసభలో ప్రతిచోటా కాంగ్రెస్ జల ద్రోహాన్ని ఎండగడతామని అన్నారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రానికి నష్టం జరగకపోతే చూస్తు ఊరుకోమని, పౌరుషం గల బిడ్డలం ప్రశ్నిస్తామని అన్నారు. ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం తాము కాదని, రైతన్నల హక్కులకు భంగం కలిగితే భగ్గున మండుతామని హెచ్చరించారు. 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని.. మళ్లీ వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెట్టడం తథ్యమని కేటీఆర్ ట్వీట్ చేశారు.