బోడుప్పల్: మేడిపల్లి పోలీసులతో కలిసి ఈగల్ టీమ్ సిబ్బంది మేడిపల్లిలో గంజాయి పెడ్లర్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పృథ్విరాజ్, రాహుల్, అక్రం, షఫీలను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పృథ్విరాజ్ హైదరాబాద్ చెంగిచెర్లకు చెందిన వ్యక్తిగా గుర్తంిచారు. కొవిడ్ తర్వాత ఉపాధి కోల్పోయిన ఇతను ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
ఇక నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ తనిఖీలు డిసెంబర్ 31 వరకూ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. తొలి రోజే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో 304 మంది పట్టుబడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి 304 వాహనాలను సీజ్ చేశారు.