మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం అంశంలో ముమ్మాటికీ దోషి కేసీఆరేనని కేంద్ర హోం శా ఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణకు 575 టీఎంసీలకు గాను 299 టీఎంసీలు చాలని అంగీకరించిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. అపెక్స్ కమిటీ సమావేశంలో నాటి సీఎం జగన్మోహన్ రెడ్డే ఈ విషయం చెప్పారని గుర్తు చేశారు. దీనిపై అవసరమైతే నాటి ఒప్పందాలను బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పా రు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ గురువారం మీడియాతో చిట్ చాట్ చేశారు. కేసీఆర్ పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య లు చాలా తప్పు అని పేర్కొన్నారు. సీఎం పదవిలో ఉంటూ అట్లాంటి భాష వాడటం సరికాదని, సీఎం హోదాలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. కేసీఆర్ కుటుంబం కంటే పెద్ద శని తెలంగాణలో లేదన్న బండి సంజయ్ తెలంగాణను సర్వనాశనం చేసిన కుటుంబం కేసీఆర్‌దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని ప్రజలు గమనించే కేసీఆర్‌ను ఫాంహౌజ్ కే పరిమితం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం తప్ప ఇంకొకరు బాగుపడలేదని అన్నారు.
కేంద్రం నుంచి పంచాయతీలకు రూ.3 వేల 5 కోట్లు
కేంద్రం నుండి రాష్ట్రానికి రూ.3,005 కోట్లు పంచాయతీలకు రాబోతున్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రే ఈ విషయా న్ని ఒప్పుకున్నారని, మళ్లీ కేంద్రం ఏమిచ్చిందని ఎదురుదాడి చేయ డం సిగ్గు చేటని అన్నారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ని ధులు ఇవ్వకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. ఒక్కో పంచాయతీకి రూ.5 లక్షలు ఇస్తామని సిఎం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న ఆయన పంచాయతీలకు సీఎం బిచ్చమేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఒక్కో పంచాయతీకి సగటున రూ.కోటి ఇవ్వాలని బండి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు పన్నులు కట్టే ఆదాయంతో 6 గ్యారంటీల ను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా నిరాశ, నిస్ప్రహల్లో ఉన్నారని అన్నారు. తెలంగాణ కేబినెట్‌లో ఇద్దరు, ముగ్గురు మంత్రులు చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని వేల కోట్ల అక్రమాలు సంపాదిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నార ని, ఇంటెలిజెన్స్ ద్వారా మంత్రుల అక్రమాలపై రిపోర్టులు తెప్పించుకుంటున్నామని చెప్పారు. ఆ మంత్రుల భాగోతమంతా త్వరలోనే బయటపెడతామని బండి సంజయ్ వెల్లడించారు.
కాళేశ్వర అక్రమాలపై ఎందుకు జరపడం లేదు?
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల స్కాం జరిగితే, కేవలం 9 వేల కోట్ల అక్రమాలపైనే విచారణను ఎందుకు పరిమితం చేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఎవరిని కాపాడేందుకు రూ. లక్ష కోట్ల అక్రమాలపై విచారణ జరపడం లేదని కూడా ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని దానం నాగేందర్ చెప్పినా స్పీకర్ ఎం దుకు స్పందించడం లేదని, సుమోటోగా తీసుకుని దానంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్ ను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రభాకర్ రావు ఎంతో మంది జీవితాలను నాశనం చేశారని, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ కుటుంబాని ప్రమేయం ఉందని అన్నారు. ఆరు వేల మందికిపైగా ఫోన్లను ట్యాప్ చేసిన చరిత్ర కేసీఆర్‌దేనని, తాము అధికారంలోకి వస్తే ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ తో కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు.
రాజాసింగ్ స్వేచ్ఛా జీవి
రాజాసింగ్ రాజీనామా చేశారని, ఆయన స్వేచ్ఛా జీవి అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాజాసింగ్ బిజెపిపై చేస్తున్న వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ఆయన రాజీనామా చేశారని, ఇప్పుడు ఆయన స్వేచ్ఛా జీవి అని పేర్కొన్నారు.