మన తెలంగాణ/నారాయణపేట ప్రతినిధి/కోస్గి: నే ను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల ఫ్యా మిలీని అధికారంలోకి రానివ్వనని బిఆర్‌ఎస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నిక లు జరిగితే 80కు పైగా,150 నియోజకవర్గాలకు ఎ న్నికలు జరిగితే 100కు పైగా స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తా… కొడంగల్ వేదికగా సవాల్ విసురుతున్నా… చేతనైతే కాస్కో బి డ్డా అని కెసిఆర్‌పై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో బుధవారం నారాయణపేట్ జిల్లా కోస్గి పట్టణంలోని లక్ష్మి నరసింహా ఫంక్షన్‌లో కొ డంగల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైనా స ర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు ఆత్మీ య సమ్మేళనం సన్మాక కార్యక్రమాల్లో సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొని సర్పంచులను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం మా ట్లాడుతూగత పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని తొడుక్కోవడానికి చెప్పులు, వేసుకోవడానికి బట్టలు లేని వాళ్లకు వేల కోట్ల ఆస్తులు వచ్చాయే తప్ప పాలమూరుకు నీళ్లు రాలేదన్నారు. పడావు పడ్డ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పనులు మొదలయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉ న్నట్లు పదేళ్లలో వాళ్లు చేసిన అప్పులు మన ముందు ఉన్నాయని అన్నారు. ఫామ్‌హౌస్‌లో బందీగా మారి న కెసిఆర్ వాళ్ల పాపాన వారు పోతారని ఊరుకు న్నా చాలా రోజుల తరువాత బయటకు వచ్చి తోలు తీస్తానని మాట్లాడుతున్నాడని మా సర్పంచులు చీరి చింతకు కట్టి చింతమడకకు పంపిస్తారన్నారు. ఒక్కటైనా ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడలేదని, పదేండ్లు పాలమూరుపై పగబట్టి పాలమూరు అభివృద్ద్ధిని ఆడ్డుకున్నాడు.
మటన్ కొట్టు మస్తాన్‌కు చెప్తా అక్కడకు వెళ్లి తోలు తీయమని విమర్శించారు. మాకు మాటలు రాక కాదు మర్యాద ఉండదని మాట్లాడటం లేదని రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా అంటున్నావ్ ఇదేం దుబాయ్ పాస్ పోర్ట్ బ్రోకర్ దందా కాదన్నారు. మేం కక్ష రాజకీయాలు చేయమని ఎవరి పాపాన వాళ్లే పోతారని, మా పని మేం చేసుకుంటున్నామని, అయినా మా జోలికి వస్తే మా కార్యకర్తలు ఊరుకోరాని అన్నారు. కొడంగల్ వేదికగా సవాల్ విసురుతున్నా 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 80కు పైగా,150 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగే 100కు పైగా స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తా.. ఇదే నా సవాల్ చేతనైతే కాస్కో బిడ్డా నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం రాబోయే ఎన్నికల్లో కెసీఆర్‌కు అధికారం ఇక కల్లనే అని బీఆర్‌ఎస్, కేసీఆర్ చర్రిత ఇక ఖతమే కొడంగల్ సాక్షిగగా ఇదే నా శపథమన్నారు. పది మందిని వెనకేసుకుని పొంకనాలు కొట్టుడడం కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రా ఏ అంశంపై అయినా అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ద్ధం రండి అని అన్నారు. సొంత చెల్లిలి భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని వాళ్ళింటి ఆడబిడ్డనే చెబుతోందని, సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాల్ విసురుతున్నాడని మీ గ్రాండ్రిపులకు, బెదిరింపులకు భయపడేది లేదన్నారు.దేశ పునాదులు గ్రామాల్లో ఉన్నాయని మహాత్మాగాంధీ అన్నారని, గ్రామాలు అభివృద్ధి చెందితే రాష్ట్రాలు, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజాపాలనతో మారుమూల ప్రాంతాలు, తండాలు,గ్రామాల్లోని సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని అన్నారు. ఎన్నికలప్పుడే పార్టీలు పంతాలు ఎన్నికలు ముగిసాయి. ఇక పార్టీలు పంతాలు లేకుండా అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోదామన్నారు.
మన కొడంగల్ నియోజకవర్గంలో ఎవరిపై వివక్ష చూపొద్దు చిన్న చిన్న సమస్యలు ఉంటే పక్కన పెట్టి గ్రామ కక్షలకు తావు లేకుండా నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. నిండు మనసుతో మీరు ఆశీర్వదించి గుండెల్లో పెట్టుకోవడం వల్లే ముఖ్యమంత్రి హోదాలో మీ ముందు నిలబడ్డానని, కొడంగల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. రాష్ట్రంలోనే లేని సైనిక్ స్కూల్‌ను లగచర్లకు తీసుకొచ్చామని 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్‌ను కొడంగల్‌లో కడతామన్నారు.దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకోవాలి అన్నారు. కొడంగల్ వేదికగా రాష్ట్రంలోని గ్రామ సర్పంచులకు త్వరలోనే ప్రత్యేక నిధులు చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు,పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు మంజూరు చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే, ఎంపిలు, మంత్రులకు సంబంధం లేకుండా ప్రతి గ్రామ పంచాయతీకి సిఎం ప్రత్యేక నిధుల నుంచి జమ చేస్తామని సర్పంచుల గౌరవం పెంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నమన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో రేషన్ కార్డులు లేని వారి పేర్లు, ఉచిత కరెంటు లేని వారి పేర్లు, ఇందిరమ్మ ఇల్లు రాని వారికి, రైతు భరోసా రాని రైతుల పేర్లు రాసుకుని ఇస్తే అర్హులైన అందరకీ ఆయా పథకాలను అందిస్తామన్నారు. కోటి మంది ఆడ బిడ్డలకు సారే పేరిట చీర ఇస్తున్నాం.. ఇంకా ఎవరికైనా చీర అందకపోతే ఇవ్వాలని అందేలా చర్యలు తీసుకోవాలని సిఎస్,కలెక్టర్లను ఆదేశించారు.
పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షులు రఘువర్థన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, కాడ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, నాయకులు యుసుఫ్, ప్రసన్నరెడ్డి, బెజ్జు రాములు, తుడుం శ్రీనివాస్, నరేందర్, ముద్దప్ప, కృష్ణంరాజులతో పాటు తాలుకాలోని నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.