తల్లీదండ్రుల చేతిలో కూతురు హత్యకు గురైన సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయి ఇటీవల మరణించింది. కడుపునొప్పి భరించలేక కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టగా తల్లిదండ్రులే కూతురును హత్య చేసినట్లు గుర్తించారు. కూతురు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అది ఇష్టం లేని తల్లిదండ్రులు కూతురుకి బలవంతంగా పురుగుల మందు తాగించి గొంతునులిమి హత్యచేశారు. కూతురును చంపిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.