రాయ్ పూర్ : ఒడిశా కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన స్థలంలో ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం సిఆర్ఎఫ్ బలగాలు గాలింపు కొనసాగుతుంది. మావోయిస్టు కీలకనేత నల్గొండ జిల్లా పుల్లేంల గ్రామవాసి గణేశ్ ఉయికే చనిపోయారని, ఉయికేపై రూ.1.10 కోట్ల రివార్డు ఉఉందని ఒడిశా పోలీసులు వెల్లడించారు.