చెన్నై: తమిళనాడు కడలూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లను ఆర్టిసి బస్సు ఢీకొంది. 9 మంది మృతి చెందారు. తిరుచునాపల్లి నుంచి చెన్నైకి బయల్దేరిన తమిళనాడు ఆర్టిసి బస్సు టైరు పేలి అదుపుతప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని సహాయక చర్యలు చేపట్టారు.