పెన్సిల్ విద్యార్థి ప్రాణం తీసిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. విహార్(6) ప్రైవేటు స్కూల్ లో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం స్కూల్ లో లంచ్ టైంలో టాయిలెట్ కి వెళ్లి తిరిగి తరగతి గదికి వెళ్తుండగా విహార్ కాలు జారి కింద పడ్డాడు. ఆ సమయంలో విహార్ చేతిలో ఉన్న పెన్సిల్ గొంతులో గుచ్చుకుంది. ఈ ఘటనలో విహార్ కి తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే స్పందించిన స్కూల్ సిబ్బంది విహార్ ను చికిత్స నిమిత్తం కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విహార్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. విహార్ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.