వాషింగ్టన్: వలసదారుల పిల్లలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ విషం కక్కారు. 70 ఏళ్లుగా వలసదారులకు పుట్టిన మిలియన్ల మంది పిల్లలు అమెరికాకు చేసింది తక్కువేనని వ్యాఖ్యలు చేశారు. సోమాలియా వలసదారులను ఉదాహరణగా చూపుతూ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వూలో అందరిపైనా వ్యాఖ్యలు చేశారు. “సోమాలియా వలసదారులు భారీ స్థాయిలో సంక్షేమ పథకాలను వినియోగించుకుంటున్నారు. నేర కార్యకలాపాల్లో వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జన్మతః పౌరసత్వం కల్పించే పద్ధతిని రద్దు చేస్తూ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాన్ని సమర్దించాలని ట్రంప్ యంత్రాంగం అమెరికా సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేస్తోన్న సంగతి తెలిసిందే.