పట్టాలు దాటుతున్న బైక్ ను రైలు ఢీకొట్టిన సంఘటనా ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో బుధవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారిలో భార్యభర్తలు, వారి ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. వివరాలలోకి వెళితే.. పోలీసులు కథనం ప్రకారం.. షాజహాన్ పూర్ లోని రౌజా రైల్వే స్టేషన్ సమీపంలో ఓ బైక్ పాదచారులు వేళ్లే మార్గంలో పట్టాలు దాటుతోంది. అదే సమయంలో లఖ్ నవూ నుంచి వస్తోన్న ప్యాసెంజర్ రైలు ఈ బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఐదుగురు ఘటనాస్థలిలోనే చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.