న్యూఢిల్లీ : గ్రేటర్ నోయిడాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి తాను చదువులో రాణించలేక పోతున్నానన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్‌లో తాను ఓడిపోయానని, చదువుకోసం ఇంకా డబ్బును వృధా చేయాలనుకోవడం లేదని పేర్కొన్నాడు. ఈమేరకు తల్లిదండ్రులను క్షమాపణలు కోరాడు. బీహార్‌కు చెందిన ఆకాష్ దీప్, ఢిల్లీ టెక్నికల్ క్యాంపస్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
గ్రేటర్ నోయిడా లోని నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలోగల ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ చదువును సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తోటి రూమ్‌మేట్ బయటకు వెళ్లిన సమయంలో తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆకాష్‌ను అతని స్నేహితుడు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు.