తైవాన్ తీర ప్రాంత కౌంటీ టైటుంగ్ లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదయింది. దీని ప్రభావంతో రాజధాని తైపీలో భవనాలు కుప్పకూలిపోయాయి. కానీ, ప్రాణనష్టం లేదని మీడియా సంస్థలు తెలిపాయి.భూ కంపం 11.9 కిమీ లోతులో సంభవించినట్లు జపాన్ రీసర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ పేర్కొంది. భూకంప కేంద్రం టైటుంగ్ కౌంటీ హాల్ కు ఉత్తరాన 10.1 కిలోమీటర్ల దూరంలో ఉంది. హువాలియన్ కౌంటీ, పింగ్టంగ్ కౌంటీ లోనూ ప్రకంపనలు సంభవించాయి. తైవాన్ భూకంపాలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతం. బుధవారం సంభవించిన భూకంపంలో ప్రాణనష్టం జరగకపోయినా, 2016 లో దక్షిణ తైవాన్ లో జరిగిన భూకంపంలో 100 మందికిపైగా మరణించారు. 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన మరో భూకంపంలో 2000 వేల మంది మరణించారు.