అమరావతి: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకలపాలెంలో దారుణం చోటుచేసుకుంది. లంకెలపాలెంలోని పార్కువద్ద వ్యక్తి తలపై రాయితో కొట్టి దుండగలు హత్య చేశారు. స్థానికులు సమాచారం మేరకు క్లూస్ టీమ్, పరవాడ పోలీసులు ఘటనా స్థలిలో కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లా అగనంపూడి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.