వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్‌లు ‘ఈషా’ చిత్రాన్ని డిసెంబరు 25న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల్‌రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ నేపథ్యంలో హీరో అఖిల్ రాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ కథ చెప్పగానే ఎంతో షాకింగ్‌గా అనిపించింది. తప్పకుండా హారర్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఈ చిత్రం కొత్త అనుభూతినిస్తుంది. సినిమాలో ట్విస్టులు, సౌండ్ డిజైనింగ్ సూపర్బ్. సినిమాలో వినయ్ అనే పాత్రను చేస్తున్నాను. నలుగురు చిన్నప్పటి స్నేహితుల్లో నేను ఒకరిని. త్రిగుణ్, సిరి, హెబ్బా పటేల్, మైమ్ మధు వంటి మంచి నటులతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఇక ప్రస్తుతం నాలుగు, ఐదు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఆన్‌సెట్స్‌లో తరుణ్‌భాస్కర్, అనుపమతో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. భద్రి దర్శకుడు”అని అన్నారు.