దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలు ‘బాహుబలి’. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాక.. కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన నసిని= అయితే ఈ సినిమా విడదలై పదేళ్ల పూర్తన సందర్భంగా రెండు సినిమాలు కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో విడుదల చేశారు. రెండు భాగాల్లో సుమారు 90 నిమిషాలకు పైగా సన్నివేశాలు తొలగించారు. అక్టోబర్ 31 ఈ చిత్రం విడులైంద. సినిమాల్లో ఉన్న అవంతిక లవ్ స్టోరీ, పచ్చ బొట్టేసిన పాట, ఇరుక్కుపో పాట, కన్నా నిదురించరా సాంగ, యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు కొన్ని తొలగించారు. అసలు విషయానికొస్తే.. బాహుబలి ది ఎపిక్ ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 25 నుంచి ప్రముఖ ఒటిటి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మరి ఒటిటిలో అయినా.. తొలగించిన సన్నివేశాలు తిరిగి జత చేస్తారని అభిమానులు భావిస్తున్నారు.