మన తెలంగాణ/ హైదరాబాద్ : అహంకారం తలకెక్కి ఉన్మాదిలా ప్ర వర్తిస్తున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించర ని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. 2028 ఎన్నికల్లో ప్రజలకు ఆయనకు తగి న గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వాదనలో విఫలమైనప్పుడు, నిజాలు చెప్పే దమ్ము లేనపుడు దివాళా కోరు రాజకీయాలకు మిగిలేది ది క్కుమాలిన వ్యక్తిగత దూషణలు మాత్రమేనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పాలనపై దృష్టి లేనప్పుడు, ఇచ్చిన హామీల అమలుపై ధ్యాస లేనపుడు, ప్రతిపక్షం నిలదీతకు సమాధానం చెప్పలేక చతికిల పడినపుడు వచ్చేవి ఇలాంటి రోత మాటలే వస్తాయని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రేవంత్ రెడ్డి రాక్షస భాషను, చిల్లర చేష్టలను, వెకిలి వేషాలను తెలంగాణ సమాజం సునిశితంగా గమనిస్తున్నదన్నారు.