మన తెలంగాణ/హైదరాబాద్: శాసనసభ శీతాకా ల సమావేశాలు ఈసారి వాడి వేడిగా జరుగుబోతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీ ఆర్‌ఎస్ పరస్పరం ఎదురుదాడికి దిగేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నెల 29 నుం చి శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ఇప్పటి కే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స మావేశాల నిర్వహణ పై బుధవారం సాయంత్రం నోటీఫికేషన్ వెలువడింది. ఈ సమావేశాలకు ముం దే అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య జల వి వాదాలు రాజుకున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ చాలాకాలం తర్వాత పా ర్టీ కార్యాలయానికి రావడం, ఆ సందర్భంగా కాం గ్రెస్ ప్రభుత్వం నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్ర యోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించడం, దానికి సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా స్పం దించిన విషయం తెలిసిందే. దమ్ముంటే కేసీఆర్ అ సెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని సవాల్ విసరడంతో పాటు కోస్గిలో బుధవారం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచకపడటంతో చలికాలంలోనూ అసెంబ్లీ సమావేశా లు గరం గరంగా సాగనున్నాయన్న సంకేతాలు అందుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్, మరో ప్రత్యర్థి పార్టీ బిజెపి ఇం త కాలం పరస్పరం ఆరోపించుకుంటుడగా, ఇప్పు డు ఇక అసెంబ్లీ, కౌన్సిల్ వేదికల ద్వారా ఆరోపణ లు,
ప్రత్యారోపణలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాల సభ్యులు చేసే ప్రతి విమర్శను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు దిశా నిర్దేశం చేశారు. తాను ఎలాగైనా కేసీఆర్‌ను సభకు రప్పిస్తానని, సభలో కేసీఆర్‌ను కార్నర్ చేసి వారి హయాం లో జరిగిన తప్పిదాలను ఎండగట్టి ఆత్మరక్షణలో పడేద్దామని చెప్పినట్టు సమాచారం. ప్రతిపక్షాన్ని స భలో గుక్కతిప్పుకోకుండా మూక్కుమ్మడిగా దాడికి దిగాలని పార్టీ ఎమ్మెల్యేలకు కూడా దిశా నిర్దేశకం చేసినట్టు తెలిసింది. మరోవైపు బిఆర్‌ఎస్ కూడా అ ధికార కాంగ్రెస్ సభ్యులు మంత్రుల నుంచి ఎదురయ్యే విమర్శలు, ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోంది. బిఆర్‌ఎస్ లెజిస్లేచర్ పార్టీ రెండు, మూడు రోజులలో సమావేశం కాబోతున్నట్టు సమాచారం. దీనికి పార్టీ అధినేత కెసిఆర్ స్వయంగా హాజరై ఎమ్మెల్యేలకు దిశా నిర్ధేశం చేయనున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. నీటి పారుదల ప్రాజెక్టులు, ముఖ్యంగా పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశం కాకుండా ఫోన్ ట్యాపింగ్ పై కూడా చర్చకు పాలకపక్షం సిద్ధం అవుతోంది. ఈ సమాచారం ఆధారంగా దీనిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు బిఆర్‌ఎస్ సిద్ధం అవుతున్నట్టు తెలిసింది.
హిల్ట్ పాలసీని ఎండగట్టే యోచన
పరిశ్రమలకు కేటాయించిన భూములను రెగ్యులరైజ్ చేసే అవకాశం కల్పించే వెసులుబాటు కల్పించే (హిల్ట్ పాలసీ) పై ప్రభుత్వంపై ఎదురుదాడికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌తో పాటు మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ కూడా సన్నద్ధం అవుతోంది. భూకబ్జాలు జరుగుతున్నాయని, అటవీ భూములకూ రక్షణ లేదని, ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని, ‘హైడ్రా’ పేరుతో పేదల ఇండ్ల కూల్చివేతలపై సభలో చర్చకు పెట్టాలని భావిస్తున్నాయి.
అవినీతిని ఎండగట్టాలని బిజెపి వ్యూహం
అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని బిజెపి వ్యూహ రచన చేస్తోంది. ఈ మేరకు త్వరలోనే బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశం కాబోతోన్నట్టు సమాచారం.
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రజల దృష్టిని మళ్లించిందని ఇప్పటికే బీజేపీ విరుచుకపడుతున్నది. రెండేండ్ల కాంగ్రెస్ పాలన పట్ల సమస్యలను అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని విమర్శిస్తోంది. వీటన్నింటినీ ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని బిజెపి వ్యూహరచన చేస్తోన్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.మరోవైపు మజ్లీస్, సిపిఐ సభ్యులు కూడా ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి.
29 నుంచి కౌన్సిల్, అసెంబ్లీ సమావేశాలు
నోటిఫికేషన్ విడుదల
రాష్ట్ర శాసనమండలి, శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల నుంచి ప్రారంభంకానున్నాయి. బుధవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు శాసనపరిషత్తు కార్యదర్శి వి. నరసింహాచార్యులు జివో జారీ చేశారు. ఉభయ సభలూ ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానున్నాయని ఆయన తెలిపారు. ఇదిలాఉండగా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై తొలి రోజున కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే బిఏసి సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారు.